‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా నుంచి న్యాయం చేయరా దేవుడా సాంగ్ రిలీజ్

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా నుంచి న్యాయం చేయరా దేవుడా సాంగ్ రిలీజ్

సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌‌ వర్క్స్ జరుగుతున్నాయి. ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ సాగే పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈ పాటకు సాహిత్యం నేనే రాశా. సునీత పాడారు. మహావీర్ ఎల్లంధర్ సంగీతం సమకూర్చారు.

మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది.  తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ చేసిన  ఐటం సాంగ్‌‌ సినిమాకు స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌గా నిలుస్తుంది’ అని చెప్పారు.  టీమ్ అంతా పాల్గొన్నారు.