గ్రేట్ : 1951 నాటి ఓటరు.. రేపు కూడా ఓటేయబోతున్నాడు

గ్రేట్ : 1951 నాటి ఓటరు.. రేపు కూడా ఓటేయబోతున్నాడు

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో ప్రత్యేకమైన అంశం. భారతదేశంలో తొలి లోక్ సభ ఎన్నికల్లో ఓటేసిన ఓ ఓటర్ .. 17వ లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటేయబోతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా.. రేపు జరగనున్న చివరి దశ ఎన్నికల పోలింగ్ లో ఓటేయబోతున్నారాయన.

ఆ ఓటర్ పేరు శ్యామ్ సరణ్ నేగి. ఆయన వయస్సు 102 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ లోని కల్పాలో ఉంటారు. 1951లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఓటేశారు. ఇన్నేళ్లలో ప్రతి లోక్ సభ పోలింగ్ లోనూ పాల్గొన్నారు. తాజాగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటేయబోతున్నారు. తనలాంటి వాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఎక్కడో ఉండి ఉంటారనీ.. ఈ ఘతన సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన అంటున్నారు.

ఎంతో ప్రత్యేకమైన ఈ ఓటరును సగౌరవంగా పోలింగ్ బూత్ కు తీసుకొస్తామన్నారు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కిన్నౌర్.  ఆయనకు సన్మానించి… ప్రత్యేక గుర్తింపు అందిస్తామన్నారు. దేశంలో ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు.