భారత బ్యాట్స్‌‌మన్‌‌ను ఔట్ చేసేందుకు ఆసీస్ చీప్ ట్రిక్స్

భారత బ్యాట్స్‌‌మన్‌‌ను ఔట్ చేసేందుకు ఆసీస్ చీప్ ట్రిక్స్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టును డ్రా చేయడానికి భారత్ పోరాడుతోంది. పుజారా (205 బాల్స్‌‌లో 77) మారథాన్ ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకోగా.. కీపర్ రిషబ్ పంత్ (118 బాల్స్‌‌లో 97) పించ్ హిట్టింగ్‌‌తో అలరించాడు. డ్రా చేసుకోవాలంటే భారత్ మరో 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. హనుమ విహారి (7), రవిచంద్రన్ అశ్విన్ (24) క్రీజులో ఉన్నారు. అదే ఆస్ట్రేలియాకు 5 వికెట్లు తీస్తే విక్టరీ కొడుతుంది.

ఈ విషయాన్ని పక్కనబెడితే పంత్ హిట్టింగ్‌‌తో ఊపు మీద ఉన్న సమయంలో అతడ్ని ఔట్ చేయడానికి ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన చర్యపై విమర్శలు వస్తున్నాయి. క్రీజుపై పంత్ బ్యాటింగ్ గార్డ్‌‌ను, ఫుట్ మార్క్స్‌‌ను స్మిత్ కాలుతో చెరిపిన వీడియో నెట్‌‌లో హల్‌‌చల్ అవుతోంది. గెలుపు కోసం కంగారూ టీమ్ ఎంతటికైనా దిగజారుతుందా అంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.  స్మిత్‌పై కామెంట్లతో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

‘ఇలాంటివి చేస్తున్నారు కాబట్టే నాలాంటి వాళ్లు ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నాం. అహంకారంగా ప్రవర్తిస్తున్న ఆస్ట్రేలియా టీమ్‌‌ను సపోర్ట్ చేయలేం’ అని ట్విట్టర్‌‌లో ఓ ఆస్ట్రేలియా అభిమాని కామెంట్ చేయడం గమనార్హం.