బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉంది. బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ లో బాల్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. చిన్న పేగు సంబంధిత కాన్సర్ తో గత కొంత కాలంగా బాధ పడుతున్న బద్దం బాల్ రెడ్డి.. ఫిబ్రవరి 10వ తేదీన కేర్ హాస్పిటల్ లో చేరారు. క్యాన్సర్ క్రమంగా లివర్ కు కూడా సోకిందని డాక్టర్లు చెప్పారు. 13వ తేదీన చిన్న పేగుకు ఆపరేషన్ చేశారు కేర్ ఆస్పత్రి డాక్టర్లు. పరిస్థితి విషమించడం తో వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు.


