బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ చెతక్ : సింగిల్ చార్జింగ్‌తో 95కిలో మీటర్లు

బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ చెతక్ : సింగిల్ చార్జింగ్‌తో 95కిలో మీటర్లు

బజాజ్ ఆటోమోబైల్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. ఇది ఎలక్ట్రిక్ చెతక్ గా మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్కూటర్ ను ఒక్క సారి చార్జింగ్ చేస్తే చాలు ఈకో మోడ్ లో 95కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. స్పోర్ట్స్ మోడ్ లో అయితే 85కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అయ్యేందుకు 5గంటల టైమ్ పడుతుందని చెప్పింది. అయితే 25శాతం చార్జింగ్ అవడానికి ఒక గంట మాత్రమే సమయం పట్టనుందని తెలిపారు. ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 1లక్ష రూపాయలుగా నిర్ణయించారు. దీనికి ముందు భాగంలో డిస్క్ బ్రేక్,  హార్స్ షూ ఎల్ఈడీ హెడ్ లైట్లు… వెనక భాగంలో ఎల్ఈడీ బ్లింకర్స్ ఉన్నాయి.  తాళం చెవి అవసరం లేకున్నా..  స్కూటర్ ను స్టార్ట్ చేయవచ్చు. దీనికి పూర్తిగా మెటల్ బాడీ కలిగిఉంది. ఇందులో 3కిలోవాట్ అవర్ల బ్యాటరీని ఏర్పాటు చేయడంతో పాటు… ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ను అందిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రయాణించవచ్చు.

ఇ-చెతక్ స్కూటర్ ను టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే ఆన్ లైన్ లో అప్లైయ్ చేసుకొవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ స్కూటర్ లో రివర్స్ గేర్ ను కూడా పెట్టారు. స్కూటర్ ను యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో చార్జింగ్ స్టేటస్, లొకేషన్, ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. స్కూటర్ ను కొన్న వారికి ఒక చార్జర్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ బండిపై 3ఏళ్ల వారంటీతో పాటు… 50వేల కిలోమీటర్ల వరకు వారంటీ వర్తించనుంది. 12వేల కిలోమీటర్లకు ఒక సారి సర్వీస్ చేయించుకోవాలని, మొదటి మూడు సర్వీసులను ఉచితంగా ఇస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.