వాలెంటైన్స్ డేను రద్దు చేయాలి

వాలెంటైన్స్ డేను రద్దు చేయాలి

హైదరాబాద్: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని భజరంగ్ దళ్ తెలంగాణ శాఖ కన్వీనర్ సుభాష్ చందర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వాలెంటైన్స్ డేకు విరుద్ధంగా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. వాలెంటైన్ డే అనే విష సంస్కృతి మనది కాదన్న ఆయన… అది పాశ్చాత్య సంస్కృతి అన్నారు. ఆ రోజును వాలెంటైన్ రోజుగా కాకుండా.. అదే రోజున అమర జవాన్లను గుర్తు చేసుకుంటూ అమరవీర్ జవాన్ దివస్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 12న గ్రీటింగ్స్ దహనం కార్యక్రమం నిర్వహిస్తామని.. 14న ఉదయం అమరవీరులకు రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ప్రజలను చైతన్య పరుస్తూ.. నెక్లెస్ రోడ్డులో కాగడాల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీ ఏడాదిలాగే ఆ రోజు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో కనబడితే తమ పని తాము చేస్తామని తెలిపారు భజరంగ్ దళ్ తెలంగాణ శాఖ కన్వీనర్ సుభాష్ చందర్.