మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్

మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్

 సుచిత్రలో సర్వేనెంబర్ 82/ఈలోని 600 గజాల ల్యాండ్ ను కొనుగోలు 2015లో చేశానని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తనతో పాటు ఆరుగురు కలిసి సుధామ నుండి సేల్ డీడీ చేసుకున్నామని తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మిగితా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అన్నారు. తమకు సేల్ డీడీ చేసిన సుధామ 2000 సంవత్సరంలోనే ఆ ల్యాండ్ ను కొనుగోలు చేశారని అతని నుండి తాము ల్యాండ్ కొనుగోలు చేశామని చెప్పారు.

ల్యాండ్ సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపించారు. తాము శ్రీనివాస్ రెడ్డికి ఆ ల్యాండ్ ను 2021లో అమ్మేశామని చెప్పారు. తమకు 2016 నుండి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని మల్లారెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఇన్ని జులు దౌర్జన్యం చేశాడని చెప్పారు. మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలని ముఖ్యమంత్రి దృష్టికి మల్లారెడ్డి అరాచకాలను తీసుకెళ్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై నోరు ఉంది కదా అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. ఈ ల్యాండ్ వివాదంలో అనేకసార్లు మల్లారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని కలిసి సెటిల్ చేయమని అడిగానని  వాళ్ల ల్యాండ్ లేనప్పటికీ దౌర్జన్యంగా ల్యాండ్ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.