The Raja Saab Censor Review: "ది రాజా సాబ్" సెన్సార్ రిపోర్ట్.. మూడు గంటల పాటు ప్రభాస్ విశ్వరూపం.. రన్‌టైమ్ ఫిక్స్!

The Raja Saab Censor Review: "ది రాజా సాబ్" సెన్సార్ రిపోర్ట్.. మూడు గంటల పాటు ప్రభాస్ విశ్వరూపం.. రన్‌టైమ్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'సలార్', 'కల్కి 2898 AD' వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత, ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్'.  2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెన్సార్ అప్డేట్, నిడివి ఎంతంటే.?

లేటెస్ట్ గా ఈ 'ది రాజా సాబ్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'U/A' సర్టిఫికేట్‌ను పొందింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ సినిమా నిడివి. ఈ చిత్రం దాదాపు 183 నిమిషాల ( 3 గంటల 3 నిమిషాలు) రన్‌టైమ్‌ను కలిగి ఉందని టాక్. సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు ఇంత నిడివి ఉండదు, కానీ ప్రభాస్ హీరోయిజం, మారుతి మార్క్ కామెడీ, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

ప్రభాస్ ద్విపాత్రాభినయం..

ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారు. ఒకటి స్టైలిష్‌గా ఉండే యువకుడి పాత్ర కాగా, మరొకటి భయంకరమైన గెటప్‌లో ఉండే 'రాజా సాబ్' పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లలో ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

ALSO READ : "ఆ రెండు పదాలకు క్షమాపణలు.. నా ఉద్దేశ్యం అది కాదు!"..

గూస్‌బంప్స్ గ్యారెంటీ..

'ది రాజా సాబ్' ట్రైలర్ చూస్తుంటే ఇదొక గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తోంది. ఒక పురాతన బంగళా, అందులో దాగి ఉన్న ఆత్మలు, వాటిని ఎదుర్కోవడానికి ప్రభాస్ చేసే పోరాటం ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ నీటిలో మొసలితో తలపడే సన్నివేశం, సంజయ్ దత్ ఎంట్రీ హైలైట్‌గా నిలిచాయి. సంజయ్ దత్ ఇందులో ఒక హిప్నోటిస్ట్, భూతవైద్యుడుగా అత్యంత శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నారు.

మ్యూజికల్ హిట్

ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు.  ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ స్టార్‌డమ్‌ను ఎలివేట్ చేసే 'రెబల్ సాబ్' సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అలాగే నిధి అగర్వాల్‌తో ఉన్న మెలోడీ సాంగ్ యువతను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో  మాళవిక మోహనన్, రిద్ది కుమార్. నటిస్తున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వంటి వారు కీలవ పాత్రను పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్‌ను ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ పాత్రలో చూడబోతుండటంతో సంక్రాంతి రేసులో 'రాజా సాబ్' విజయం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.