భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్

భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్

తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం, మే 19 నుంచి మంగళవారం మే 21 మధ్య రాష్ట్రానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్ కాశి, కోయంబత్తూరు, తంజావూర్, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, కన్యాకుమారి జిల్లాలో డ్యామ్‌లపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ కూడా ఏదైనా సంభావ్య రెస్క్యూ ఆపరేషన్ కోసం సన్నద్ధమైంది. కన్యాకుమారి జిల్లా అధికారులు మాట్లాడుతూ ఏదైనా వరదలు సంభవించినట్లయితే ప్రజలను తరలించడానికి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికైన అగ్నిమాపక రెస్క్యూ విభాగం సిద్ధంగా ఉందన్నారు.

విద్యుత్ లైన్లు తెగిపోవడం వల్ల ప్రజలు నీటి వనరుల దగ్గరకు వెళ్లవద్దని, విద్యుత్తు అంతరాయం సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే, ప్రజలు వెంటనే స్థానిక విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. కన్యాకుమారి జిల్లాలోని తొమ్మిది డ్యామ్‌లపై నిరంతర నిఘా ఉంచామని, ఈ డ్యామ్‌లలోకి భారీగా నీరు చేరితే కొన్ని డ్యామ్‌లను తెరుస్తామన్నారు.