సమస్యలు తీర్చకుంటే ప్రగతి భవన్ ముట్టడి

సమస్యలు తీర్చకుంటే ప్రగతి భవన్ ముట్టడి

తెలంగాణ బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ , బిసి స్టూడెంట్స్ లీడర్ అంజి ,విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్ ఫీజు  రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను 1500 ల నుంచి 3000 వేలకు పెంచాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్యాకెట్ మని ఇవ్వాలని డిమాండ్స్ చేశారు. 

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ  SC,ST,BC హాస్టల్ స్టూడెంట్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విధ్యార్ధులకు మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను పెంచారన్నారు. విద్యార్థులు ఏం పాపం చేశారని మండిపడ్డారు. విద్యార్థుల పై పెట్టేది ఖర్చు కాదు,పెట్టుబడి అన్నారు ఆర్ కృష్ణయ్య. పెండింగ్ ఫీజు రియింబర్సమెంట్స్ ,స్కాలర్ షిప్  ఫీజులను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల హాస్టల్ లో మౌలిక సదుపాయాలు పెంచాలన్నారు. సొంత హస్టల్ భవనాలు నిర్మించాలన్నారు. హాస్టల్ స్టూడెంట్స్ కు ప్యాకేట్ మని నెలకు 600 వందలు ఇవ్వాలన్నారు. డే స్కాలర్ ఫీజులను,5,500 ల నుంచి, 20వేలకు పెంచాలన్నారు.  హాస్టల్ విద్యార్థుల సమస్యలను వెంటనే తీర్చాలి.... లేకుంటే ఉద్యమం చేపట్టి ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.