మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు...అద్దంకి దయాకర్ 

మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు...అద్దంకి దయాకర్ 

తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం  ముంచుకొస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, హక్కులు ఉండవని అన్నారు. 

ఓటమి భయం తో రాజ్యాంగ భక్షకులైన బిజెపి ,ఆరెస్సెస్ లకు మోడీ ఏజెంట్ గా మారిండని అన్నారు. రాజ్యాంగ హక్కులను  హరింప జేయడానికి నూతన మనువాద వాదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చూస్తుండని అన్నారు దయాకర్.ఎన్నికల కోసం మోడీ దేశం మొత్తం తిరుగుతుండని, కానీ మణిపూర్ పోవాలంటే గజగజ వణుకుతుండని ఎద్దేవా చేశారు.మణి పూర్ లో మహిళ పై ఊచకోత కోసినా మోడీ ఇప్పటివరకు నోరు మెదపలేదని అన్నారు.మోడీ ఓబీసీ అయిఉండి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని,దీనికి మోడీ సమాధానం చెప్పాలని అన్నారు. దేశంలో రోజు రోజుకి మహిళ ల పై దాడులు జరుగుతున్నవని ఆగ్రహం వ్యక్తం చేశారు.బ్యాంకింగ్ సిస్టం మొత్తం కోలాప్స్ అయిందని,భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి మేధావులు ఆలోచించాలని అన్నారు దయాకర్.