కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్

కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్

 మేడ్చల్ జిల్లా: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 27న హెట్రో బంకెట్ హాల్ లో బిఆర్ఎస్ నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో కరెంట్ పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా కరెంట్ పోతుందని హెద్దేవ చేశారు.

అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా కరెంట్ పోయేది కాదని మల్లారెడ్డి కార్యకర్తలతో అన్నారు. కరెంట్ పోయిందన్న విషయం తెలిసిన పై అధికారులు ఎంక్వైరీ జరిపించారు. ఆ సమయంలో ఎల్సీ తీసుకున్నారని డిఈ తెలిపారు. అయితే ఎల్ సీ తీసుకోవాలంటే పై స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదని తెలిసింది. దీంతో సదరు కీసర డివిజన్ అధికారి భాస్కర్ రావును సిఎండి ముషారఫ్ అలి సస్పెండ్ చేశారు. అహ్మద్ గుడలోని ఐ కమ్ కంపిని వద్ద కరెంట్ పోవడంతో ఎల్సీ తీసుకున్న తేలింది.