ఓయూలో సర్వత్ హుస్సేన్ సెంటర్ ప్రారంభం

ఓయూలో  సర్వత్ హుస్సేన్  సెంటర్ ప్రారంభం

హైద‌‌‌‌రాబాద్ సిటీ, వెలుగు: ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోష‌‌‌‌ల్ సైన్సెస్‌‌‌‌లోని జ‌‌‌‌ర్నలిజం, మాస్ క‌‌‌‌మ్యూనికేష‌‌‌‌న్ విభాగంలో స‌‌‌‌ర్వత్ హుస్సేన్ డిజిట‌‌‌‌ల్ మీడియా సెంట‌‌‌‌ర్‌‌‌‌ను వీసీ ప్రొఫెసర్​కుమార్ ఆదివారం ప్రారంభించారు. 

ఇందులో 2 లేటెస్ట్​కెమెరాలతోపాటు యాపిల్ స్టూడియో కంప్యూటర్ ఉన్నాయి. రూ.20 ల‌‌‌‌క్షల విలువైన ఈ ప‌‌‌‌రిక‌‌‌‌రాల‌‌‌‌ను విద్యా భండార్కర్ త‌‌‌‌న భ‌‌‌‌ర్త, ఈ విభాగం మాజీ విద్యార్థి స‌‌‌‌ర్వత్ హుస్సేన్ జ్ఞాప‌‌‌‌కార్థం విరాళంగా ఇచ్చారని తెలిపారు. సర్వత్ హుస్సేన్ 1987-–89 మధ్య ఓయూలో బీసీజే, ఎంసీజే పూర్తి చేశారన్నారు. ఇక్రిశాట్‌‌‌‌లో ఉద్యోగం త‌‌‌‌ర్వాత 1992లో ప్రపంచ‌‌‌‌ బ్యాంకుకు వెళ్లారని చెప్పారు. 25 ఏళ్లపాటు ప్రపంచ బ్యాంకు క‌‌‌‌మ్యూనికేష‌‌‌‌న్స్ విభాగంలో ఉన్నత స్థాయికి ఎదిగారని, 2017లో వాషింగ్టన్ డీసీలోని బ్యాంకు హెడ్డాఫీసులో ప‌‌‌‌ద‌‌‌‌వీ విర‌‌‌‌మ‌‌‌‌ణ పొందారని పేర్కొన్నారు.