మహబూబాబాద్ అర్బన్/ తొర్రూరు/ ములుగు, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు కేసులను పరిష్కరించారు. మహబూబాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన కేసులో బీమా కంపెనీ రూ.22 లక్షల నష్టపరిహారం ఇచ్చించేందుకు కృషి చేసినట్లు లోక్‌అదాలత్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు.
తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 521 కేసులను పరిష్కరించి, రూ.19.19 లక్షల జరిమానా విధించినట్లు జడ్జి ధీరజ్ కుమార్ తెలిపారు. ములుగు జిల్లా కోర్టులో ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీసూర్య చంద్రకళ ప్రారంభించి మాట్లాడారు. నాలుగు బెంచీలతో నిర్వహించిన కార్యక్రమంలో 413 పెండింగ్ కేసులు పరిష్కారమైనట్లు జడ్జి తెలిపారు.
