రాష్ట్రస్థాయి పోటీలకు  బ్లూబెల్స్విద్యార్థులు 

రాష్ట్రస్థాయి పోటీలకు  బ్లూబెల్స్విద్యార్థులు 

పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి అబాకస్, వేదిక్​మ్యాథ్స్ పోటీలకు పిట్లం బ్లూబెల్స్​ హైస్కూల్​ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం కామారెడ్డిలో విశ్వం ఎడ్యకేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్​స్థాయి అబాకస్, వేదిక్​ మ్యాథ్స్​ పోటీల్లో బ్లూబెల్స్​స్కూల్​ నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

ఇందులో అబాకస్​లో మనస్విని, అఫ్సన్​ ఖాన్, శివాని విజయం సాధించగా, వేదిక్​ మ్యాథ్స్​లో మనస్విని, ఖుషి, సరస్వతి, మధులిక ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్​ ప్రిన్సిపాల్​​సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన స్కూల్​ టీచర్​ దేవాగౌడ్​తో కలిసి అభినందించారు.