ఎవరు ఈ రీతు తవ్డే ? ముంబై కొత్త మేయర్‌గా బీజేపీ సీనియర్ నేత!

ఎవరు ఈ రీతు తవ్డే ? ముంబై కొత్త మేయర్‌గా బీజేపీ సీనియర్ నేత!

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)  మేయర్‌గా రీతు తవ్డే పేరు ఖరారైంది. దింతో BMC చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతోంది. గత 40 ఏళ్లలో మొదటిసారిగా బీజేపీకి చెందిన వ్యక్తి మేయర్ పదవిని చేపట్టబోతున్నారు. మహాయుతి కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ కార్పొరేటర్ రీతు తవ్డే పేరును ఖరారు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా శివసేన నేత సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు.

రీతు తవ్డే రాజకీయ ప్రస్థానం
రీతు తవ్డే ముంబై రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న నాయకురాలు.  ఆమె 2012, 2017 ఎన్నికల్లో వరుస విజయాలతో కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు 2026 ఎన్నికల్లో 132 వార్డు నుండి విజయం సాధించి, రెండోసారి కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

ఆమె మరాఠా సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, గుజరాతీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గెలిచి తన సత్తా చాటారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను పరిష్కరించే నాయకురాలిగా ఆమెకు మంచి పేరుంది.

BMC ఎన్నికలు
2026 BMC ఎన్నికల ఫలితాల్లో  BJP 89 సీట్లు గెలుచుకుంది, శివసేన మొత్తం 227 సీట్లలో 29 సీట్లు గెలుచుకుంది. ఈ కూటమి కలిసి మెజారిటీ మార్కును దాటింది. మరోవైపు, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) 65 సీట్లు గెలుచుకుంది. అదనంగా MNS 6 సీట్లు, NCP (శరద్ పవార్ వర్గం) 1 సీటు గెలుచుకుంది.