సమాధానం చెప్పలేక పారిపోతుండు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

సమాధానం చెప్పలేక పారిపోతుండు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, వెలుగు : రెండున్నర ఏండ్లలో కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం కామారెడ్డిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కామారెడ్డిలో ఏం చేశారని బీజేపీ అభ్యర్థులు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రోడ్లు వేయటం, డ్రైనేజీలు నిర్మించటం, నీటి సప్లై పట్టణ పారిశుధ్యం, స్ర్టీట్ లైట్లు వేయటం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. కరప్షన్  కట్టడి చేశామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ లీడర్లకు కరప్షన్​పై మాట్లాడే హక్కు లేదని, దొంగే.. దొంగ..  అని అరిచినట్లుగా ఉందన్నారు. కామారెడ్డి పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్​అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.