కేసీఆర్ గజ్వేల్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు నిరసన సెగ

 కేసీఆర్ గజ్వేల్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు నిరసన సెగ

మున్సిపల్ ఎన్నికల్ ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ఇలాకాలో మాజీ మంత్రి హరీశ్ కు నిరసన సెగ తగిలింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు నిరసనకు దిగారు. ప్రచారానికి  రాకముందే హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ ముంపు గ్రామాల ప్రజలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ముంపు బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కాసేపు తోపులాట జరగడంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రేవంత్ వచ్చాక భూముల ధరలు పాతాళానికి :హరీశ్ 

అంతకు ముందు గజ్వెల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన హరీశ్ రావు...  రెండేళ్లలో గజ్వేల్ రోడ్డు కు గుంతలు పడితే పూడ్చే సోయి లేదు కాంగ్రెస్ వాళ్ళకు .  గజ్వేల్ కు అభివృద్ధి చేసింది కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు.  నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 50 వేల కోట్లు తిన్నారని  మిషన్ కాకతీయ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడిండు.  కేసీఆర్ వచ్చాక గజ్వేల్ లో భూముల ధరలు కోట్లకు పెరిగితే రేవంత్ రెడ్డి వచ్చాక బంగారం ధర పెరిగి భూముల ధరలు పడిపోయాయి.  రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ లకు  రిబ్బన్ కట్ చేసుడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలను ప్రారంభించుడు తప్ప చేసిందేమీ లేదు.  బీజేపీ వాళ్ళు పాల ధరలు , జీఎస్టీ లు పెంచిండు తప్ప చేసిందేమీ లేదు , కానీ పైసలు బాగా పంచుతారంట.  కరోనా సమయం లో నేను తిరిగిన మీ కోసం బిజెపి , కాంగ్రెస్ వాళ్లు తిరిగారా ? . మీ కోసం మేము ఉన్నాం మా కోసం మీరు ఉండాలి.  ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిన , కాళ్ళు  మొక్కినా  బిఆర్ఎస్ కే ఓటు వేయాలి..మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలి అని అన్నారు.

►ALSO READ | యుద్ధం చేసే వాళ్లకే కత్తి ఇవ్వాలి.. మున్సిపాలిటీ పోరులో కాంగ్రెస్ నే గెలిపించాలి: మంత్రి పొంగులేటి