డేటా సెంటర్లపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. డేటా సెంటర్లు పెట్టటం వల్ల హీట్ ఎక్కువగా వస్తుందని.. వాటర్ ప్రాబ్లమ్ వస్తుందని.. పర్యావరణం దెబ్బతింటుంది అంటూ అమెరికాలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలు డేటా సెంటర్లకే ఇలా ఉంటే.. AI డేటా సెంటర్ల వల్ల రాబోయే ముప్పును ముందుగానే గుర్తించినట్లు ఉన్నారు ఎలన్ మస్క్.. ఈ క్రమంలోనే రాబోయే మూడేళ్లలో అంతరిక్షంలో AI డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు ఎలన్ మస్క్.. భూమిపై కంటే అంతరిక్షంలో AI డేటా సెంటర్లు ఏర్పాటు వల్ల 30 ఆదా అని చెప్పేస్తున్నారు.. అంటే ఇప్పటికే దీనిపై ఎలన్ మస్క్ గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టం అవుతుంది.
అంతరిక్షంలో AI డేటా సెంటర్ల వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పేశారాయన. అంతరిక్షంలో పగలు, రాత్రి ఉండదు.. తుఫాన్లు ఉండవు.. వర్షాలు ఉండవు.. 24 గంటలూ సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది.. వాతావరణ మార్పులు ఉండవు.. నీళ్ల అవసరం ఉండదు.. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదాతోపాటు పర్యావరణానికి బెస్ట్ అని వివరిస్తున్నారు ఎలన్ మస్క్..
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మరో విప్లవాత్మక అడుగు వేయబోతున్నారు. రాబోయే 30 నుండి 36 నెలల్లోనే అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. భూమి మీద కంటే అంతరిక్షమే ఏఐకి అత్యంత చౌకైన వేదికగా మారుతుందని మస్క్ చెప్పారు. ఇటీవల పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలను వివరించారు.
►ALSO READ | అమెరికా మ్యాప్ సెన్సేషన్: PoK, అక్సాయ్ చిన్ భారత్‌లో భాగమేనన్న ట్రంప్ టీమ్.. పాక్, చైనాలకు షాక్..!
భూమిపై విద్యుత్ వినియోగాన్ని పెంచడం కంటే అంతరిక్షంలో విద్యుత్ ఉత్పాదన చాలా సులభమని మస్క్ పేర్కొన్నారు. అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ పనితీరు భూమిపై కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూమిపై ఉన్నట్లుగా అంతరిక్షంలో పగలు-రాత్రి, మేఘాలు, వాతావరణం, కాలమార్పులు ఉండవని.. దీనివల్ల నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని చెప్పారు. వాతావరణం లేకపోవడం వల్ల ఎనర్జీ వేస్టేజ్ 30 శాతం తగ్గుతుందని.. రాత్రిపూట విద్యుత్ కోసం ఖరీదైన బ్యాటరీల అవసరం కూడా ఉండదని స్పష్టం చేశారు.
ఏఐ శిక్షణలో ఉపయోగించే జీపీయూల(GPUs) విశ్వసనీయత గురించి వస్తున్న అనుమానాలను మస్క్ కొట్టిపారేశారు. ప్రారంభ దశలో వచ్చే చిన్నచిన్న సాంకేతిక ఇబ్బందులు దాటిన తర్వాత.. ఈ చిప్స్ చాలా కాలం పాటు సమర్థవంతంగా పనిచేస్తాయని మస్క్ వెల్లడించారు. ఎన్విడియా, టెస్లా లేదా ఇతర కంపెనీలు తయారు చేసే ఏ చిప్ అయినా ఒకసారి స్థిరపడితే వాటికి తరచుగా సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉండదని, అందుకే వీటిని అంతరిక్షంలో నిర్వహించడం సులభమని మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రణాళిక విజయవంతమైతే.. ఏఐ మౌలిక సదుపాయాల భవిష్యత్తు భూమిని దాటి నింగిలోకి విస్తరించనున్నాయని ఎలాన్ మస్క్ మాటలు చెబుతున్నాయి.
