కోల్ ఇండియా ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ -2026, జనవరి15.
పోస్టుల సంఖ్య: 125.
కంపెనీల వారీగా ఖాళీలు: కోల్ ఇండియా లిమిటెడ్ (కోల్కత్తా, పశ్చిమబెంగాల్) 07, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (ధన్‌బాద్, జార్ఖండ్) 12, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (రాంచీ, జార్ఖండ్) 15, పీఎంపీడీఐఎల్ (రాంచీ, జార్ఖండ్) 07, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (శాంక్టిరియా, పశ్చిమబెంగాల్) 12, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సంబల్పూర్, ఒడిశా) 20, నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సింగ్రౌలి, మధ్యప్రదేశ్) 20, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (బిలాస్పూర్, చత్తీస్‌గఢ్) 20, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (నాగ్‌పూర్, మహారాష్ట్ర) 12.
ఎలిజిబిలిటీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 26.
లాస్ట్ డేట్: 2026, జనవరి 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు coalindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
