10 నెలల్లో 14 వేల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పుల్ బాటిల్స్ సీజ్

10 నెలల్లో 14 వేల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పుల్ బాటిల్స్ సీజ్

హైదరాబాద్: తెలంగాణలో పన్ను చెల్లించని మద్యం భారీగా పట్టుబడింది. 14 వేల పుల్ బాటిల్స్ను ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. 10 నెలల్లో 14 వేల పుల్ బాటిల్స్ను ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ మద్యం మొత్తం ఖరీదైన మద్యమే అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.

గోవా,ఢిల్లీ, హర్యానా, నోయిడా, వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అక్రమంగా తరలించినట్లు ఎక్సైజ్ శాఖ తేల్చింది. పట్టుబడుతున్న మద్యం కేవలం 15 శాతమే అని.. ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా పన్ను చెల్లించని మద్యం తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తనిఖీలతో వెల్లడైంది.

ఎక్సైజ్ శాఖ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఏడాదికి 5 కోట్ల అక్రమ మద్యం రవాణా అవుతుండటం గమనార్హం. ఎక్సైజ్ శాఖ ప్రజలకు అవగాహన కల్పించకాపోవడం కూడా ఇందుకు ఒక కారణం. బ్రాండ్ లిక్కర్ మిక్సింగ్, కల్తీ మద్యంతో కూడా ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీ గానే గండి పడింది.

►ALSO READ | డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన దేవ్ జీ.. ఇంకా అజ్ఞాతంలో 11 మంది మావోయిస్టులు