మహబూబాబాద్అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో బలరాంనాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలను పరిష్కరించాలి
మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 15వ వార్డు ఆర్లగడ్డ తండాలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడా సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడుతూ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, సీసీ రోడ్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
