‘కోటంచ’కు కొత్త రూపం..ఆలయ పునరుద్ధరణకు రూ.82.25 కోట్లు కేటాయింపు 

‘కోటంచ’కు కొత్త రూపం..ఆలయ పునరుద్ధరణకు రూ.82.25 కోట్లు కేటాయింపు 
  • 8న ఆలయ పునఃప్రతిష్టాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భక్తుల కొంగు బంగారంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పేరొందింది. ఈ ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి 2023 ఫిబ్రవరిలో టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో నిర్వహించిన జోడో యాత్రలో భాగంగా సందర్శించి పూజలు చేశారు. అధికారంలోకి రాగానే ఆలయ పునరుద్ధరణ చేపట్టి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్​రెడ్డి సీఎం అయ్యాక పున:రుద్ధరణ కోసం మొత్తం రూ.82.25 కోట్లు మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించి పది నెలల్లోనే పనులు పూర్తి చేశారు. దీంతో ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. ఈ ఆలయ పున:ప్రతిష్టాపనకు ఈ నెల 8న సీఎం రేవంత్​రెడ్డి రానున్నారు. ఇందుకోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పున:ప్రతిష్టాపన పనులు త్రిదండి చిన జీయర్​ స్వామి ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.