గ్రేటర్‌ వరంగల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాగునీటి సప్లైపై ప్రత్యేక దృష్టి : కమిషనర్ టి.వెంకన్న 

గ్రేటర్‌ వరంగల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాగునీటి సప్లైపై ప్రత్యేక దృష్టి : కమిషనర్ టి.వెంకన్న 

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ ప్రజలకు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీడబ్ల్యూఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వెంకన్న ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం గ్రేటర్​ప్రజలకు ప్రధాన జలవనరులైన ధర్మసాగర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కమిషనర్ పరిశీలించారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలు, నగరానికి జరుగుతున్న తాగునీటి సరఫరా విధానం, నీటిశుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత, పంపింగ్ వ్యవస్థ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, శుద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్, కేయూసీ ఫిల్టర్ బెడ్, దేశాయిపేట ప్రతాప రుద్ర ఫిల్టర్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. అంతకుముందు గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘన వ్యర్థాల నిర్వహణపై బల్దియా హెడ్డాఫీసులో అధికారులతో రివ్యూ చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, ఈఈలు రవికుమార్, మాధవిలత సంజయ్ కుమార్, డీఈలు అధికారులు పాల్గొన్నారు.