హనుమకొండ, వెలుగు: రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో భూముల రీసర్వేపై గురువారం గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సరిహద్దులను నిర్ణయించడం, సర్వే నంబర్ ను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.
రీసర్వే చేపట్టేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, రోవర్స్, డీజీపీఎస్‌తో ఇంచు భూమి కూడా తప్పిపోకుండా సర్వే జరుగుతుందన్నారు. హద్దులు నిర్ణయించని పక్షంలో ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అంతకుముందు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లపై డీఈవో, ఎంఈవోలతో రివ్యూ చేశారు. పర్మిషన్ ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
