‘తొర్రూరు’ను మోడల్ గా తీర్చిదిద్దుతాం :  ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

‘తొర్రూరు’ను మోడల్ గా తీర్చిదిద్దుతాం :  ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఆదరించి గెలిపిస్తే రాష్ట్రంలోనే తొర్రూరు మున్సిపాలిటీని మోడల్​ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్​ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. మున్సిపాల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని 8, 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సుమలత నరేశ్​ రెడ్డి, బసనబోయిన ఐలమ్మ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. త్వరలో జరిగే మున్సిపల్​ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డుల్లో క్లీన్​స్వీప్​ చేసి మున్సిపాలిటీపై కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.