భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో మహిళలు బతుకమ్మ ఆడేందుకు గ్రామానికి చెందిన లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి ఎకరం భూమి విరాళంగా అందజేశారు. ఆదివారం గ్రామస్తుల సమక్షంలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఎకరం భూమితోపాటు బతుకమ్మ బండ అభివృద్ధి కోసం మరో రూ.10 లక్షలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థలం అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కాగా, జీపీ ఎన్నికల్లో ఇదే హామీతో గ్రామానికి చెందిన మండల రజినిని సర్పంచ్ బరిలో నిలిపి గెలిపించినట్లుగా గ్రామస్తులు తెలిపారు.
