- సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్
కామారెడ్డిటౌన్, వెలుగు: పక్క ప్రణాళికతో కార్యక్రమాలు అమలు చేస్తేనే సంచార జాతుల్లో వికాసం సాధ్యమని సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచార జాతుల వారికి సామాజిక సమరసత వేదిక, రోటరీ క్లబ్ సంయుక్తంగా రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్ మాట్లాడుతూ.. సంచార జాతుల్లో వెలుగులు ప్రకాశించాల్సిన అవసరముందన్నారు.
రిజర్వేషన్ల ఫలాలు పొందడంలో సంచార జాతి ప్రజలు ఆమడ దూరంలో ఉన్నారన్నారు. చలి కాలం దృష్ట్యా రగ్గులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వేదిక గౌరవ జిల్లా అధ్యక్షుడు తుమ్మ రామచంద్రం, విభాగ్ సహా సంయోజక్ బాల్రాజుగౌడ్, జిల్లా ప్రెసిడెంట్అమృత రాజేందర్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్శంకర్, ప్రతినిధులు కృష్ణహరి, వెంకటరమణ, ప్రశాంత్, దత్తురావు, రాజేంద్రప్రాద్పాల్గొన్నారు.
