కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 53 మందికి కోర్టులు శిక్షలు విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర గురువారం తెలిపారు. ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష, మరోకరికి 3 రోజుల జైలు శిక్ష పడిందన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మంది, దేవునిపల్లిలో 6, బిచ్కుందలో 5, బీబీపేటలో 1, రాజంపేట 2, దోమకొండ1, బాన్సువాడ5, బీర్కుర్2, నస్రుల్లాబాద్ 6, నిజాంసాగర్ 7, పిట్లంలో 4 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో..
నిజామాబాద్ : ధర్పల్లి పోలీస్ స్టేషన్‌పరిధిలో గురువారం డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపిన రాంపూర్గ్రామానికి చెందిన ఒడ్డెన్నను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చగా సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సామ శ్రీనివాస్తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్తప్పక ధరించాలని ఎస్సై సూచించారు.
