బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తామంటుంది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తామంటుంది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తామని అంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగం మారిస్తే ఎస్సీ, ఎస్టీ  రిజర్వేషన్స్, హక్కులు కోల్పోతారని చెప్పారు. బీజేపీ హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ముందు చూపుతో అంబేద్కర్ రాజ్యాంగం రాశారని చిన్న రాష్ట్రాలు వచ్చినప్పుడే అభివృద్ధి చెందుతుందని రాజ్యాంగంలో  పేర్కొన్నారని తెలిపారు. బీజేపీ ఎంపినే రాజ్యాంగం మారుస్తామని అన్నారని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేఖం కాదని తెలిపారు.  

వివేక్ వెంకటస్వామి కుటుంబంపై మంద కృష్ణ మాదిగ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బాల్క సుమన్ ఓడిపోయిన ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారని చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. 10 వేల కోట్ల రూపాయల అప్పు ను మాఫీ చేయించి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ  రీ ఓపెన్ చేయించానని గుర్తు చేశారు. కవిత ఎంపి గా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళది కుటుంబ పాలన కాదా... కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తన సంస్థల్లో రూపాయి అవినీతి ఉండదని రూ.10 వేల కోట్ల రూపాయల టాక్స్ కట్టమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడమని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు.  

పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి వంశి కృష్ణ మాట్లాడుతూ దళితుల ద్రోహి బీజేపీ పార్టీ అని ఫైర్ అయ్యారు వంశీ కృష్ణ. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని అన్నారు. బ్రిటిష్ పాలన తీరులో బీజేపీ విభించు పాలించు తరహాలో వ్యవహరిస్తుందని 70 ఏళ్ల కిందట అంబెడ్కర్  అందరికి స్వేచ్ఛ కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తోనే అన్నీ వర్గాలకు న్యాయం జరుతుందని చెప్పారు.