పిచ్చి పీక్స్​కు చేరింది.. భార్యతో రొమాంటిక్​ సాంగ్​... సోషల్​మీడియాలో అప్​ లోడ్​

పిచ్చి పీక్స్​కు చేరింది.. భార్యతో రొమాంటిక్​ సాంగ్​... సోషల్​మీడియాలో అప్​ లోడ్​

హైటెక్ యుగం దాటి ఏఐ యుగం నడుస్తుంది. అప్పడు.. ఇప్పుడు.. ఎప్పుడు.. సోషల్​ మీడియా రూటే వేరు.. ఎవరు ...ఎప్పుడు.. ఎలా .. పాపులర్​ అవుతారో తెలియదు.  ఒక్కోసారి జనాలు చేసే వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతోనే ఇంటర్​ నెట్​ షేక్​అవుతుంది.  ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో కలిసి చేసిన రొమాంటిక్​ సాంగ్​ ను సోషల్​ మీడియాలో అప్​ లోడ్ చేశాడు.. ఇక అంతే  భార్యతో వీడియో తీయడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వాఘభాయ్ తన భార్యతో కలిసి 'రాజా హిందుస్తానీ' చిత్రంలోని ఒక పాటలో నటిస్తున్నాడు. ఈ పాటను ఆయన పాడుతుండగా.. ఆమె డ్యాన్స్​ చేస్తుంది.  అతని భార్య రెడ్​ కలర్​  లెహంగా ధరించింది.  వాఘభాయ్​ దంపతులు చాలా క్యూట్‌గా ఉన్నారు.  ఈ పాటను ఆయన పాడుతూ.. ఆమె చేసిన డ్యాన్స్​ ను వాఘభాయ్ పర్మార్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేశారు.  ఇక అంతే నెటిజన్స్​ ఊరుకుంటారా... ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు కామెంట్స్​ చేయడం మొదలు పెట్టారు. 

వాఘభాయ్​ తన భార్యతో  రొమాంటిక్​  సాంగ్​ వీడియోను సోషల్​ మీడియాలో పోస్టె చేయడంతో  సోషల్​ మీడియా వినియోగ దారులు డర్టీ కామెంట్స్​ పెట్టారు. గుర్రాలకు గడ్డా దొరకడం లేదని.. గాడిదలు చ్యవనప్రాష్ తింటున్నాయని ఎవరో రాస్తే.. తమ్ముడా..  నీ భార్య ఒంటరిగా ఉందామరొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) ఈ వీడియోను  20 లక్షల మందికి పైగా వీక్షించగా..  84 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, వేలాది మంది షేర్ చేశారు.   నెటిజన్లు చాలామంది డర్టీ కామెంట్స్​ చేస్తున్నారు.  తీపి పదార్దాల్లో కీటకాలు ఉంటాయని చెప్పేందుకు ఈ వీడియో  చరిత్ర సాక్షి అని  ఒకరు రాశారు.  ఇంకొకరు లంగూర్​ కు ద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చిందని మరొకరు కామెంట్​ చేశారు.  ఈ వీడియోను చూసిన మరొక వ్యక్తి .. నాకు కొంచెం విషం ఇవ్వండి.. నీళ్లలో మునిగి చనిపోతాను.. కాని నాకు ఈత వచ్చని అర్దం లేని కామెంట్​ చేశారు.  నాల్గవ వ్యక్తి ఇది డబ్బు మాయాజాలం.. చూడండి.. చూసి చలా సంపాదించండి అని రాసుకొచ్చారు. 

వాఘభాయ్​ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు  1 లక్షా 86 వేల మందికి పైగా ఫాలోయర్స్​ ఉన్నారు.  ఇతను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి మాదిరిగా ఉన్నాడు.  వాఘాభాయ్ .. అతని భార్య  చేసిన రొమాంటిక్​ సాంగ్​ వీడియోపై కొంతమంది నెటిజన్స్​ అసభ్యకరంగా స్పందించగా .. కొంతమంది మంచి విషయాలు కూడా రాశారు.  నరేష్ గోస్వామి అనే వినియోగదారుడు దేవుడు మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని రాయగా... సిను అనే మరొక వ్యక్తి  కింగ్ ఆఫ్ పర్మార్ అని రాశారు.