Naga chaitanya: మరోసారి జోడీగా పూజా-చై..థ్రిల్లర్‌తో సెట్ చేసిన హిట్ డైరెక్టర్!

Naga chaitanya: మరోసారి జోడీగా పూజా-చై..థ్రిల్లర్‌తో సెట్ చేసిన హిట్ డైరెక్టర్!

విరూపాక్ష మూవీ తెరకెక్కించిన  డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) అక్కినేని నాగచైతన్య(Nagachaithanya)తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అదిరిపోయే థ్రిల్లర్ స్టోరీని చైకి వినిపించాడట కార్తీక్.

డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నాగ చైతన్య కోసం డైరెక్టర్ కార్తీక్ మరో విభిన్నమైన థ్రిల్లర్‌ కథని సిద్ధం చేశారట. ఈ యేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతుంది. 

అలాగే తాజా సమాచారం ప్రకారం..ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde)కు ఆఫ‌ర్ దక్కిందట. చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న పూజాకు ఈ అవకాశం రావడం గ్రేట్ అనే చెప్పుకోవాలి.ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ పూజా హెగ్డే ని కలిసినట్లు సమాచారం. 

ఇప్పటికే నాగ చైతన్య, పూజా హెగ్డే `ఒక లైలా కోసం` సినిమాలో నటించి మెప్పించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సూపర్ హిట్ జోడీ వస్తుండటం ఫ్యాన్స్ కు కూడా నచ్చేసిందని టాక్. మరి పూజా ని నిజంగా తీసుకున్నారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే..నాగ చైతన్య కి వంద కోట్ల హిట్ పడితే చూడాలన్నది అక్కినేని ఫ్యాన్స్ కల. ఎందుకంటే, బంగార్రాజు,లవ్ స్టోరీ చిత్రాలు వచ్చి పర్లేదు అనిపించినా బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకోలే. ఒక మోస్తరు హిట్ కంటే.. హై రేంజ్ హిట్ కావాలంటూ ఫ్యాన్స్ గిరి గీసీ పెట్టుకున్నారు.

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్ పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్..అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మరి త్వరలో అధికారిక ప్రకటనతో పాటు స్టోరీ ఎలాంటిదో కూడా తెలిసిపోతుంది.ప్రస్తుతం చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే త్వరలో దూత 2 షురూ చేసే అవకాశం ఉంది.