
స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa2TheRule). తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతుందంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
"సెన్సేషనల్ సర్‌ప్రైజ్‌తో..సెన్సేషనల్ సాంగ్ రాబోతుందంటూ..అల్లు అర్జున్ మేనియా తెలిపే స్టైలిష్ పుష్ప రాజ్ పోస్టర్ను పోస్ట్ చేశారు. పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్ అంటూ ఉన్న ఈ ఫస్ట్ సింగిల్..రేపు సాయంత్రం 5.04 గంటలకు తెలుగు,హిందీ,తమిళం,కన్నడ,మలయాళం &బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది.
రాక్ స్టార్ DSP సంగీత సారథ్యంలో రాబోతున్న ఈ మాస్ సాంగ్ రిలీజయ్యాక..పుష్ప చాంటింగ్ షురూ కాబోతుంది.ఈ పోస్టర్లో అల్లు అర్జున్ లుక్ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.మరి రేపు రిలీజ్ కానున్న పుష్ప గాడి సాంగ్ తో ఊగిపోవడానికి సిద్ధం కండి మై డియర్ ఐకాన్స్.
S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶
— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024
Sensational song ✅??#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way ??
A Rockstar @ThisIsDSP Musical ?#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA
ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ అయ్యాయి. దేవి శ్రీ ఇచ్చిన ట్యూన్స్ కి భాషతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేయడం..హుమ్మింగ్ చేయడం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 ఆగమనం మొదలవ్వడంతో..పార్ట్ 2కి సంబంధించిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది..ఈ ఒక్క సాంగ్ తో తెలిసిపోతుంది.
అయితే పుష్ప పార్ట్ 1 కి వచ్చిన స్పందన..ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ దృష్ట్యా..పుష్ప 2 సినిమాపై మరింత బాధ్యత ఉంది మేకర్స్. కనుకే, ఈ సినిమాలో రిలీజ్ చేసే పోస్టర్ దగ్గర నుండి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.
పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ 2024 ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.