Prasanth Varma: ప్రశాంత్ చదివిన స్కూల్ నుండి స్పెషల్ వీడియో.. కన్నీళ్లు పెట్టుకున్న హనుమాన్ డైరెక్టర్

Prasanth Varma: ప్రశాంత్ చదివిన స్కూల్ నుండి స్పెషల్ వీడియో.. కన్నీళ్లు పెట్టుకున్న హనుమాన్ డైరెక్టర్

హనుమాన్(HanuMan) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma). ఈ సినిమాతో కేవలం హిట్టు మాత్రమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రశాంత్. హనుమాన్ సినిమాను తీర్చిదిద్దిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అతి తక్కువ బడ్జెట్ లో హనుమాన్ సినిమాను విజువల్ వండర్ గా క్రియేట్ చేశాడు. అందుకే.. సౌత్, నార్త్ ఇండస్ట్రీలు ఆయన గురించి పెద్దఎత్తున చర్చ జరిపాయి.

అయితే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. దానికి కారణం ఆయన చిన్నప్పుడు చదువుకున్న రస్వతి శిశుమందిర్ స్కూల్. అవును.. ప్రశాంత్ చిన్నప్పుడు చదువుకున్న ఆ స్కూల్ నుండి మర్చిపోలేని గిఫ్ట్ అందుకున్నాడట. ఆ గిఫ్ట్ మరేదో కాదు. ఆ స్కూల్ లో ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ అందరు కలిసి హనుమాన్ అని పేరు వచ్చేలా గ్రౌండ్ లో కూర్చున్నారు. అంతేకాదు.. తనకు చదువు చెప్పిన టీచర్లు, అక్కడ పనిచేస్తున్న టీచర్లు, స్టూడెంట్స్ అందరూ హనుమాన్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హనుమాన్ రిలీజ్ కి ఒకరోజు ముందు నాకు ఈ వీడియో వచ్చింది. ఆ వీడియో చూశాక నాకు కన్నీళ్లు ఆగలేదు.. అంతో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ షేర్ చేసిన ఈ వీడియో సోసిల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం చదువుకున్న స్కూల్ నుండి ఇలాంటి గౌరవాన్ని పొందటం అంటే మామూలు విషయం కాదు.. నువ్వు చాలా గ్రేట్ ప్రశాంత్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.