ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి : కోదండరాం

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి : కోదండరాం

 దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  పౌరునిగా  వాస్తవాలను గ్రహించి అర్థవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఈడీ, సీబీఐలను రాజకీయ నాయకులను లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు.  160 మంది బిలియనియర్ గడిచిన 10 సంవత్సరాలలో ఎదిగారని తెలిపారు. 25శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. 

సంపదలు 40 శాతం వారి చేతిలో ఉందని ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడితే సమానత్వం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యం ప్రమాదంలో  పడిపోతుందని  పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ కూటమి అయిన ఇండియా కూటమికి ప్రజలంతా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనడానికి, ద్రవ్యాల్బనాన్ని  తగ్గించడానికి, భారతదేశంలో పెరుగుతున్న అసమానతలను రూపుమాపడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని సూచించారు కోదండరాం.