V6 News

బీసీసీఐ.. బిగ్‌ ప్లాన్‌

బీసీసీఐ.. బిగ్‌ ప్లాన్‌

యూఏఈలో ఐపీఎల్‌!

దుబాయ్‌లో 4-6 వారాల ట్రెయినింగ్ ​క్యాంప్

న్యూఢిల్లీ: ఇండియాలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌ చేసేందుకు బీసీసీఐ… బిగ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ వేసింది. దేశంలో కరోనా వైరస్‌‌‌‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. ఐపీఎల్‌‌‌‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ను నిర్వహించేందుకు ఆ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అలాగే క్రికెటర్ల ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ను కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఆగస్ట్‌‌‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ  ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30, 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు. ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్‌‌‌‌ 26 నుంచి నవంబర్‌‌‌‌ 8 వరకు ఐపీఎల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ ఉంది. ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే.. ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌‌‌‌ నుంచి నేరుగా అక్కడికి వెళ్లిపోతారు. మిగతా వారు ఇండియాకు తిరిగి వచ్చేస్తారు. అయితే బీసీసీఐ ప్లాన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావాలంటే ముందు టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వాయిదా లేదా రద్దు కావాలి. దీనిపై ఐసీసీ స్పష్టత ఇచ్చే దాకా ఐపీఎల్‌‌‌‌పై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకూడదు. ఒకవేళ చేస్తే అది రూల్స్‌‌‌‌ను అతిక్రమించడం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఫ్రాంచైజీలతో కూడా చర్చించలేదు. శుక్రవారం జరగబోయే కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఈ ప్లాన్‌‌‌‌పై చర్చ జరుగుతుందని సమాచారం. వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టీ20 వరల్డ్కప్ రద్దు కావడం ఖాయం.. యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ జరగడం కూడా అంతే ఖాయంగా కనిపిస్తున్నది.