V6 News

యువతకు స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ పై శిక్షణ ఇవ్వాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

యువతకు స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ పై శిక్షణ ఇవ్వాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 
  • ప్రతి జిల్లా కేంద్రంలో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించండి: మంత్రి అడ్లూరి 

హైదరాబాద్, వెలుగు: యువతకు స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఉపాధి అవకాశాలపై ట్రైనింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. 99 రోజుల ‘ప్రజా పాలన’లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో “జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు” నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు ఉపాధి శిక్షణ విభాగం, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమన్వయంతో పాల్గొనాలన్నారు.