V6 News

మంచు పర్వతంపై చిన్నారి నృత్యం

మంచు పర్వతంపై చిన్నారి నృత్యం

నిర్మల్, వెలుగు: మంచు పర్వతంపై చిన్నారి కూచిపూడి నృత్యం చేసి మన్ననలు అందుకుంది. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతంతమాత్రంగా ఆక్సిజన్  ఉన్న ప్రాంతంలో నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన పదేళ్ల చిన్నారి వరేణ్య నృత్యం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్ ప్రాంతంలోని ఆఫర్వాత్  పర్వతంపై ‘శ్రీ విజ్ఞరాజం భజే’ పాటపై నృత్యం చేసి మంత్రముగ్ధులను చేసింది.