మొదట్లో భయానకంగా ఉండేది: బీహార్ డాక్టర్లు

మొదట్లో భయానకంగా ఉండేది: బీహార్ డాక్టర్లు

పాట్నా: మొదట్లో కరోనా లక్షణాలతో పెషెంట్లు హాస్పిటల్ కు పెద్ద ఎత్తున వచ్చారని, పరిస్థితి భయానకంగా ఉండేదని బీహార్ లోని కొవిడ్ 19 హాస్పిటల్ డాక్టర్లు అన్నారు. బీహార్ ప్రభుత్వం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్ఎంసీహెచ్) లోనే కొవిడ్ 19 పెషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తోంది. ట్రావెల్ హిస్టరీ, కరోనా సింప్టమ్స్ ఉన్న 295 మంది అడ్మిట్ అయ్యారని, వారిలో 25 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని ఎన్ఎంసీహెచ్ సూపరింటెండెంట్ పి.కె.సిన్హా అన్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో ట్రీట్ మెంట్ తేలికైందని, చాలా మందిని డిశ్చార్జ్ చేశామని, కొందరిని హోం క్వారంటైన్ లో ఉంచినట్లు చెప్పారు. “మొదట్లో కష్టంగా ఉండేది. పెద్ద ఎత్తున పెషెంట్లు హాస్పిటల్ కు వచ్చారు. వేరే ఆప్షన్ లేక అందర్నీ అడ్మిట్ చేసుకున్నాం. పెషెంట్లు వార్డుల్లోని పరిస్థితిపై వీడియోలు తీసి రిలేటివ్స్, ఫ్రెండ్స్ కు పంపారు. తర్వాత కరోనా నుంచి కోలుకునే చాన్స్ ఎక్కువగా ఉందని తేలడంతో ట్రీట్ మెంట్ కు సహకరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ మేరకు ట్రీట్ మెంట్ అందిస్తున్నాం’ అని డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. మొదట్లో మాస్కులు, రక్షణ పరికరాలు ఏవీ లేవని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోడీతో మాట్లాడిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు చెప్పారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలాంటి సమస్య రాలేదని, తమ వల్ల కరోనా సోకుతుందనే అనుమానంతో పొరుగువాళ్లు, ఇంటి యజమానులు తమను అడ్డుకునేవారని అన్నారు.