
న్యూఢిల్లీ : సీనియర్ బ్యాంకర్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్ (88) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి. నారాయణ వఘల్ తన సేవకు గాను 2006 లో పద్మ భూషణ్ అవార్డు పొందారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా 1960 లో నారాయణ వఘల్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎస్‌బీఐలో జాబ్ మానేసి నేషనల్ ఇన్‌స్టిట్యూష్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్‌లో టీచర్‌గా చేరారు. రెండేళ్లలో ఈ సంస్థకు డైరెక్టర్‌గా ప్రమోట్ అయ్యారు. కానీ, ఈ పొజిషన్‌ను వదిలేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. 1981 లో బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఆయన, అతి చిన్న వయసులో ప్రభుత్వ బ్యాంక్‌ను నడిపిన వ్యక్తిగా రికార్డ్ సృస్టించారు. ఆ తర్వాత ఐసీఐసీఐ చైర్మన్, ఎండీగా జాయిన్ అయ్యారు.
ఈ సంస్థను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా తీర్చిదిద్దారు. ఐసీఐసీఐలో 1996 వరకు పనిచేశారు. నారాయణ వఘల్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) బోర్డులో మెంబర్‌గా పనిచేశారు కూడా. ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆయన్ని భీష్మ పితామహా అని కొనియాడారు. ఆయన గైడెన్స్‌లో పనిచేయడం అదృష్టమని పేర్కొన్నారు.