అంబులెన్స్ లో ప్రసవించిన మహిళ.. మృతిచెందిన శిశువు

అంబులెన్స్ లో ప్రసవించిన మహిళ.. మృతిచెందిన శిశువు

మతం పేరు అడిగి గర్భవతిని ఆస్పత్రి నుంచి పంపించిన వైద్యులు

రాజస్థాన్ లోని భరత్ పూర్ లో దారుణం జరిగింది. ముస్లీం మతానికి చెందిందని గర్భవతిని ఆస్పత్రి నుంచి పంపించివేయడంతో మార్గమధ్యలో అంబులెన్స్ లో శిశువు పుట్టి మరణించింది. సిక్రీకి చెందిన ఇర్ఫాన్ ఖాన్ భార్య నిండు గర్భవతి. ఆమెకు శుక్రవారం రాత్రి నొప్పులు రావడంతో స్థానిక హెల్త్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు భరత్ పూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో ఇర్ఫాన్ మరుసటి రోజు ఉదయం తన భార్యను తీసుకొని భరత్ పూర్ లోని RBM జెనానా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పేర్లు నమోదు చేసుకొనే సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఇర్ఫాన్ మతం గురించి అడిగారు. ఇర్పాన్ తాము ముస్లీం అని చెప్పడంతో.. అక్కడున్న వైద్యులు రెఫరల్ లెటర్ రాసి జైపూర్ కు పంపమని చెప్పారు. అక్కడున్న సిబ్బంది అలాగే చేయడంతో చేసేదేమి లేక ఇర్ఫాన్ తన భార్యను తీసుకొని అంబులెన్స్ లో జైపూర్ కు బయలుదేరాడు. మార్గమధ్యలో ఇర్ఫాన్ భార్య అంబులెన్స్ లోనే ప్రసవించింది. దాంతో ఇర్పాన్ వెంటనే తన భార్యను తిరిగి భరత్ పూర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కానీ, ఆ ఆస్పత్రి సిబ్బంది అతని భార్యను కానీ, శిశువును కానీ ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దాంతో తిరిగి జైపూర్ కు బయలుదేరారు. అలా బయలుదేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. తాము ముస్లీంలన్న కారణంతోనే తమకు వైద్యం చేయలేదని.. దాంతో తమ బిడ్డ మరణించిందని ఇర్ఫాన్ ఆరోపించాడు. తాము జమాతే తబ్లిగి ప్రార్థనలకు వెళ్లి వచ్చామని ఆస్పత్రి సిబ్బంది అనుమానం వ్యక్తం చేసినట్లు ఇర్ఫాన్ అన్నాడు.

ముస్లింలన్న ఒకేఒక్క కారణంతో గర్భవతిని వేరే ఆస్పత్రికి పంపడంపై భరత్‌పూర్‌కు చెందిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే సుభాష్ గార్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారించాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. వైద్య శాఖ కార్యదర్శి వైభవ్ గల్రియా మాట్లాడుతూ.. తమ సిబ్బంది విచారణ చేపట్టిందని.. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదే ఘటనపై భరత్‌పూర్‌లోని డీగ్-కుమ్హేర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మరియు రాష్ట్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రి విశ్వేంద్ర సింగ్ స్పందిస్తూ.. ఈ ఘటన సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. గర్భిణీ ముస్లీం అయినంతమాత్రనా వైద్యం చేయకుండా.. వేరే ఆస్పత్రికి పంపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For More News..

మీ ‌ఉద్యోగాలు సేఫ్.. జీతాలు తగ్గించం.. ఉద్యోగాలను తీసేయం

ఢిల్లీ తబ్లిగి కోసం 3 నెలల ముందే సెలక్షన్స్

కరోనా వల్ల జాబ్ పోయిందా.. అయితే ఇవిగో 12 వేల జాబ్స్ రెడీ