విద్యుత్​శాఖ అలర్ట్​

విద్యుత్​శాఖ అలర్ట్​

హనుమకొండ, వెలుగు :  ఆదివారం రాత్రి కురిసిన ఈదురుగాలుల వర్షాలకు టీఎస్​ఎన్​పీడీసీఎల్ పరిధి హనుమకొండ సర్కిల్ లో 33కేవీ, 11 కేవీ ఫీడర్ పరిధిలోని 9 స్తంభాలు, 8 ట్రాన్స్ ఫార్మర్లు నేల కొరగగా, 11 ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ సమస్యపై టీఎస్​ఎన్​పీడీసీఎల్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి రాయపర్తి , వర్ధన్నపేట సహా పలు సబ్ స్టేషన్లను విజిట్​ చేశారు.

అనంతరం విద్యుత్తు భవన్ నుంచి టీఎస్​ఎన్​పీడీసీఎల్ పరిధిలోని ఎస్ఈలు, డీఈలతో మాట్లాడి ఎన్నికలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈ  కే.వెంకటరమరణ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సబ్ స్టేషన్ల లోడ్, విద్యుత్  సరఫరా మానిటరింగ్ స్థితిగతులను తెలుసుకొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అందుబాటులో ఉండి సేవలందించిన సిబ్బందిని అభినందించారు. విద్యుత్​సమస్యలు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు 1800 425 0028 కు లేదా 1912 కు తెలియజేయాలని సూచించారు.