ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమానుష ఘటన జరిగింది. తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటికొచ్చిన పాతికేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సోమవారం రాత్రి (డిసెంబర్ 29) కదులుతున్న వాహనంలో ఈ 25 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ మహిళను గురుగ్రామ్-ఫరీదాబాద్ రహదారిపై రన్నింగ్ వెహికల్ నుంచి బయటకు తోసేసి నిందితులు వెళ్లిపోయారు.
స్పీడ్గా వెళుతున్న రన్నింగ్ వెహికల్ నుంచి తోసేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ముఖంపై 12 కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. బాధిత యువతి కుటుంబం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇద్దరు అనుమానితులను క్రైమ్ బ్రాంచ్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
డిసెంబర్ 29న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయానని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని తన సోదరికి చెప్పింది. స్నేహితురాలి ఇంటి నుంచి ఆమె రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆలస్యంగా ఇంటికి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఒక వ్యాన్ వస్తే లిఫ్ట్ అడిగింది.
ALSO READ : ఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..?
ఆమె వ్యాన్ ఎక్కే సమయానికి ఆ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తన ఇంటి వైపు వెళ్లకుండా, వాహనం డ్రైవర్ గుర్గావ్-ఫరీదాబాద్ రోడ్డు వైపు వెళ్లాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమెపై నిందితులు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, ఆమెను SGM నగర్‌లోని రాజా చౌక్‌లోని ములా హోటల్ సమీపంలో వ్యాన్ నుండి బయటకు నిందితుల్లో ఒకడు విసిరేశాడు. ఆమె తన సోదరికి ఫోన్ చేయగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను ఫరీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
