తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ మద్దతు.. అస్సాం గడ్డపై ప్రధాని మోదీ నిప్పులు!

తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ మద్దతు.. అస్సాం గడ్డపై ప్రధాని మోదీ నిప్పులు!

దేశ విభజనకు యత్నించే  తుక్డే గ్యాంగ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్ధ  కాలంగా ఈశాన్య రాష్ట్రాలను ఆ పార్టీ పట్టించుకోలేదని ఫైరయ్యారు. అస్సాంలో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్ భాస్కర్ వర్మ సేతు బ్రడ్జిని ప్రారంభించారు. అనంతరం రాజధాని గౌహతిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కు తెలిసింది ఒక్కటే అవినీతికి పాల్పడటం అని విమర్శించారు. అస్సాంకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని నిప్పులు చేరిగారు.

దేశం బాగుకోసం ఆ పార్టీ ఎప్పుడూ పని చేయలేదన్నారు. దేశ భద్రతను కాంగ్రెస్ ఎప్పుడైనా పట్టించుకుందా అని ప్రశ్నించారు. మావోవాది, ముస్లింలీగ్ కాంగ్రెస్ అన్నారు. మేం ఐదేళ్లలో ఐదు వంతెనలు నిర్మించామన్నారు. దేశం కొత్తదశలోకి ప్రవేశించిందన్నారు. ఇవాళ పుల్వామా ఘటన జరిగిన రోజు అని మోదీ గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పో యిన జవాన్లకు నివాళ్లు అర్పించారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు. ఆపరేషన్ సిందూర్ తో మన సత్తా ఏమిటో చూపించామన్నారు.