వాలెంటైన్స్ డేన ఘోరం.. పార్క్ చేసిన కారులో ప్రేమికుల శవాలు.. ఏమైందని ఆరా తీస్తే తెలిసిందో చేదు నిజం !

వాలెంటైన్స్ డేన ఘోరం.. పార్క్ చేసిన కారులో ప్రేమికుల శవాలు.. ఏమైందని ఆరా తీస్తే తెలిసిందో చేదు నిజం !

వాలెంటైన్స్ డే రానే వచ్చిందని ప్రేమికులంతా ఫుల్ జోష్లో ఉంటే ఢిల్లీ సమీపంలోని నోయిడా మాత్రం ఇద్దరు ప్రేమికుల చావుతో నిద్ర లేచింది. నోయిడాలో ఒక పార్క్ చేసిన కారులో ఇద్దరు ప్రేమికులు చనిపోయిన స్థితిలో కనిపించేసరికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. నోయిడా సెక్టార్ 107 ఏరియాలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఇద్దరినీ 32 ఏళ్ల సుమిత్, 26 ఏళ్ల రేఖగా పోలీసులు గుర్తించారు. సుమిత్ స్వస్థలం ఢిల్లీలోని త్రిలోక్ పురి కాగా.. రేఖ స్వస్థలం నోయిడా సెక్టార్ 101లోని సలార్ పూర్గా పోలీసులు తెలిపారు.

ప్రియురాలిని కాల్చి చంపి.. ఆ తర్వాత తాను కాల్చుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు లోపల లాక్ చేసి ఉంది. కారులో పిస్టల్ దొరికింది. సుమిత్ చేతిలోని పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేఖను హత్య చేసి సుమిత్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి తలలే టార్గెట్గా పిస్టల్తో కాల్చుకున్నట్లు స్పష్టమైంది. పోలీసులు ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. ఇద్దరూ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సెక్ టీం స్పాట్కు వెళ్లి ఆధారాలను సేకరించారు. సుమిత్, రేఖ మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటన గురించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం నుంచి ఈ ఇద్దరూ కనిపించకుండాపోయారు. సుమిత్ దగ్గర ఒక నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. ఇద్దరూ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే.. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరొకరితో రేఖ పెళ్లికి సిద్ధమైందని సుమిత్ ఆ నోట్లో రాశాడు. పోలీసులు రేఖది ప్రేమోన్మాద హత్యగా తేల్చారు.  ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ప్రేమికుల రోజునే ప్రియురాలిని చంపి తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.