న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవర్ వేధిస్తోందా ? త్వరగా కోలుకోవడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు..

న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవర్ వేధిస్తోందా ? త్వరగా కోలుకోవడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు..

న్యూ ఇయర్ పార్టీ అంటేనే ఫుల్ జోష్ తో ఆటలు, పాటలు, ఫ్రెండ్స్ తో కలిసి చేసే ఎంజాయ్మెంట్. అయితే రాత్రి అంతా పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత తరువాత రోజు పొద్దున్నే వచ్చే హ్యాంగోవర్ మాత్రం చుక్కలు చూపిస్తుంది. తల పగిలిపోయేల నొప్పి, వికారం, నీరసం   తెగ ఇబ్బంది పెట్టేస్తుంది.  మీరు తాగడం స్టార్ట్ చేసే ముందు ఎం  చేయాలి, తీసుకోకూడని స్మార్ట్ కాంబినేషన్స్, చేయవల్సినవి,  చేయకూడనివి, తరువాత రోజు కోలుకోవవడం వరకు, ఈ టిప్స్  మీరు తెలివిగా తాగడానికి రాత్రిపూట ఎంజాయ్మెంట్ తర్వాత ఫాస్ట్ గా హ్యాంగోవర్ నుండి రికవర్ అయ్యేలా చూస్తుంది... 

 హ్యాంగోవర్ నుండి బయటపడడానికి కొన్ని అద్భుతమైన టిప్స్.... 

నిద్రలేవగానే ఇలా చేయండి:
 నిపుణురాలు  అభిప్రాయం ప్రకారం, హ్యాంగోవర్‌తో లేవగానే  వెంటనే ఒక గ్లాసు మంచి నీటితో మీ డే స్టార్ట్ చేయడం బెస్ట్. నీరు తగిన తర్వాత అల్లం టీ లేదా పుదీనా టీ తాగడం వల్ల కడుపులో వికారం తగ్గుతుంది. చాలామంది తలనొప్పి తగ్గడానికి కాఫీ తాగుతారు, కానీ అది తప్పు. కాఫీ శరీరంలోని నీటిని మరింత తగ్గించి డీహైడ్రేషన్ లేదా  హ్యాంగోవర్‌ను పెంచుతుంది.

ALSO READ : ఈ 5 సూత్రాలు రోజూ పాటించండి.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!

శరీరానికి శక్తినిచ్చే ఆహారం:
హ్యాంగోవర్ ఉన్నప్పుడు శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిలు పడిపోతాయి. దీని కోసం అరటిపండు ఇందులో పొటాషియం,  సహజ చక్కెరలు ఉండటం వల్ల శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, వెంటనే  శక్తిని ఇస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు ఇవి ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడానికి ప్రకృతి సిద్ధమైన మందు. కొత్తిమీర, ఆస్పరాగస్‌తో చేసిన సూప్‌లు తాగడం వల్ల కూడా  శరీరానికి మేలు జరుగుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
నిపుణులు మద్యం తాగే  విషయంలో కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్పారు.  మద్యం తాగడానికి ముందు కడుపు నిండా ఆహారం తీసుకోవాలి. బ్రెడ్ వంటి పదార్థాలు ఆల్కహాల్‌ను గ్రహించి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆల్కహాల్‌ తీసుకునేటపుడు ఏ రకమైన తీపి పానీయాలతో కలపొద్దు.   మద్యం సేవించే ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. అంతేకాదు  బాదం సిరప్, తాజా అల్లం, ఆపిల్ రసం, నిమ్మరసం కలిపి తయారుచేసే ఈ 'జపనీస్ మ్యూల్' శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు హ్యాంగోవర్ నుండి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి. ఎంత నీరసంగా ఉన్నా కాసేపు ఈత కొట్టడం లేదా జాగింగ్ చేయడం వల్ల చెమట రూపంలో శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ చిట్కాలను పాటిస్తే మీ కొత్త సంవత్సరం మొదటి రోజు హాయిగా సాగిపోతుంది.