హాస్టళ్ల భద్రత కట్టుదిట్టం : కలెక్టర్ రాహుల్ శర్మ

హాస్టళ్ల భద్రత కట్టుదిట్టం : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు భద్రతపెంచుతున్నట్లు జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్​ భవానీ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ విచారణ చేపట్టారు. వార్డెన్​ భవానీని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

మంగళవారం హాస్టల్ ను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈవో రాజేందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.