జగిత్యాల జిల్లాలో హనీట్రాప్‌‌.. రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులను.. బ్లాక్‌‌ మెయిల్ చేసిన నిందితులు

జగిత్యాల జిల్లాలో హనీట్రాప్‌‌.. రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులను.. బ్లాక్‌‌ మెయిల్ చేసిన నిందితులు

కోరుట్ల, వెలుగు: అమ్మాయిల ఆశ చూపించి, తర్వాత బ్లాక్‌‌మెయిల్‌‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులను జగిత్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి, ఇబ్రహీంపట్నంకు చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి బిజినెస్‌‌ మెన్‌‌లు, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులను టార్గెట్‌‌గా చేసుకొని హనీట్రాప్‌‌కు తెరలేపారు.

మెట్‌‌పల్లికి చెందిన ఓ అమ్మాయిని పంపించి.. వాళ్లు ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా.. మెట్‌‌పల్లికి చెందిన ఓ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారిని బ్లాక్‌‌మెయిల్‌‌ చేసి రూ. 10 లక్షలు డిమాండ్‌‌ చేశారు.

సదరు రియల్టర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు ఐదుగురు వ్యక్తులతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఫోన్లలో జగిత్యాల, మెట్‌‌పల్లి ఏరియాలకు చెందిన చాలా మంది వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫొటోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ ఇంకా కొనసాగుతోందని మెట్‌‌పల్లి సీఐ అనిల్‌‌కుమార్‌‌ చెప్పారు.