ప్రైమరీ బడులను బలోపేతం చేస్తం : వేం నరేందర్ రెడ్డి

ప్రైమరీ బడులను బలోపేతం చేస్తం :  వేం నరేందర్ రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. చెప్పారు. తెలంగాణ స్టేట్  ప్రైమరీ టీచర్స్  అసోసియేషన్ (టీఎస్‌పీటీఏ) రూపొందించిన క్యాలెండర్​ను మంగళవారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. వ్యక్తి వికాసానికి ప్రాథమిక విద్యే పునాది అని, అందుకే కింది స్థాయి నుంచే బడులను బలోపేతం చేసేందుకు అన్ని రకాల పరిశోధనలు చేశామన్నారు. 

విద్య, వైద్యం రంగాలను బలోపేతం చేసి.. వచ్చే పదేండ్లలో రాష్ట్రాన్ని ‘రైజింగ్ తెలంగాణ’గా అగ్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.