హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా గంగాపురం వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఆంధ్రా మహిళా సభ డిగ్రీ కాలేజీలో రిటైర్డ్ లెక్చరర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పిచ్చయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్గా డాక్టర్ ధర్మేంద్ర, ఫైనాన్స్ సెక్రటరీగా నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
అలాగే అసోసియేట్ సెక్రటరీగా డాక్టర్ ఐలయ్య, లేడీస్ సెక్రటరీగా డాక్టర్ వెంకమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ సుధాకర్ ఎన్నికయ్యారు. రిటైర్డ్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం తెలిపింది.
